India: అడిలైడ్ టెస్టుకు సర్వం సిద్ధం.. 18 d ago
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టుకు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం అనగా 6వ తేదీ నుండి అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య డే అండ్ నైట్ టెస్టు జరగనుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ కోసం పీఎం లెవన్‌తో కాన్‌బెర్రాలో మ్యాచ్ ఆడిన టీమ్‌ఇండియా అడిలైడ్‌లో అడుగుపెట్టగానే ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టింది. చాలా రోజుల తర్వాత గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టు ఆడబోతుంది టీమ్‌ఇండియా. గత బీజీటీ టోర్నీలో ఇదే అడిలైడ్ పిచ్‌పై టీమ్‌ఇండియా టెస్టుల్లో చెత్త రికార్డు(36 ఆలౌట్)ను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.